Prithvi Raj III Chouhan
రాజ పుత్ర రాజులలో చౌహాన్ వంశానికి చెందిన రాజు పృధ్వీరాజ్ చౌహాన్. చరిత్రలో వీరుడిగా పేరుగాంచిన పృధ్వీరాజ్ చౌహాన్ పేరుతో ముగ్గురు రాజులు ఉన్నారు. మనం చర్చించుకొనే రాజు మూడవ పృధ్వీరాజ్.
పృధ్వీరాజ్ చౌహాన్ గహద్వాల వంశానికి చెందిన జయచంద్రుని కుమార్తె సంయుక్తను ప్రేమిస్తాడు. సంయుక్త కూడా పృధ్వీరాజ్ చౌహాన్ ను ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ వీరి ప్రేమ సంయుక్త తండ్రి జయచంద్రునికి ఇష్టం ఉండదు. జయచంద్రుడు రాచరిక సాంప్రదాయం ప్రకారం స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఉధ్యేశ్యపూర్వకంగా పృధ్వీరాజ్ చౌహాన్ కి ఆహ్వానాన్ని పంపడు. పైగా ద్వారం ప్రక్కనే పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహాన్ని ద్వారపాలకుడిగా నిలబెడతాడు.
స్వయం వరం ప్రారంభమౌతుంది. సంయుక్త నేరుగా పూలదండను తీసుకెళ్ళి ద్వారపాలకుడిగా ఉంచిన పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహం మెడలో వేస్తుంది. అప్పటికే విగ్రహం వెనక దాక్కున్న పృధ్వీరాజ్ చౌహాన్ సంయుక్తను తీసుకుని తన రాజ్యానికి వెళ్తాడు.
ఇదే సమయంలో మహమ్మద్ ఘోరీ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి భారత దేశం పై దండయాత్ర చేస్తాడు. 1191
లో జరిగిన మొదటి తరాయిన్ యుద్ధంలో పృధ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోర్ ని ఓడిస్తాడు. పృధ్వీరాజ్ చౌహాన్ పై కోపంతో ఉన్న పృధ్వీరాజ్ చౌహాన్ మామ జయచంద్రుడు మహమ్మద్ ఘోర్ కి తన మధ్ధతు తెలుపుతాడు. ఇద్దరూ కలిసి రెండవ తరాయిన్ యుధ్ధంలో 1192లో పృధ్వీరాజ్ చౌహాన్ ని ఓడించి, అంధుడిగా చేసి బంధిస్తారు. ఆ తరువాతి సంవత్సరంలో జరిగిన చందావార్ యుధ్ధం 1193లో మహమ్మద్ ఘోర్ జయచంద్రున్ని కూడా ఓడిస్తాడు.
పృధ్వీరాజ్ చౌహాన్ అత్యంత విలువిధ్య నైపుణ్యుడు. అతనికి శభ్ధాన్ని విని లక్ష్యాన్ని చేధించగల శభ్ధభేధి విధ్య తెలుసు. ఒక పధకం ప్రకారం పృధ్వీరాజ్ చౌహాన్ మిత్రుడు మహమ్మద్ ఘోర్ కి పృధ్వీరాజ్ చౌహాన్ విలువిధ్య నైపుణ్యాన్ని వివరిస్తాడు. మహమ్మద్ ఘోర్ ఒకరోజు పృధ్వీరాజ్ చౌహాన్ ని చెర నుండి తీసుకువచ్చి పృధ్వీరాజ్ చౌహాన్ విలువిధ్య నైపుణ్యాన్ని ఆస్వాధిస్తుంటాడు. ఎక్కడ శభ్ధం చేస్తే పృధ్వీరాజ్ చౌహాన్ ఆ లక్ష్యాన్ని చేధిస్తుంటాడు. పృధ్వీరాజ్ చౌహాన్ విలువిధ్య నైపుణ్యానికి ఆశ్యర్యపోయిన మహమ్మద్ ఘోర్ "శభాష్" అని గట్టిగా చప్పట్లు కొడతాడు. ఆ శభ్దాన్ని విని పృధ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోర్ కంఠంలోకి బాణాన్ని సంధించాడట. ఆ తర్వాత పృధ్వీరాజ్ చౌహాన్ స్నేహితుడు పృధ్వీరాజ్ చౌహాన్ ని కత్తితో పొడిచి తానూ ఆత్మహత్య చేసుకున్నాడట.
వాస్తవానికి చారిత్రకంగా పృధ్వీరాజ్ చౌహాన్ మరణ కాలం, ఘోర్ మరణ కాలం వేరువేరుగా ఉన్నాయి.
Prithvi Raj 3 Chouhan
Jayachandra
Rani Samyuktha
Mohammad Ghor
Battle of Tarain / Sthaneshwar
Battle of Chandawar

No comments:
Post a Comment