Pushyabhuthi dynasty పుష్యభూతి వంశం Harsha vardhana
పుష్యభూతి వంశం
వంశ చరిత్ర తెలుసుకోడానికి ముఖ్య ఆధారం - భానుని హర్ష చరిత్ర.
ఈ వంశ స్ధాపకుడు - పుష్యభూతి.
పుష్యభూతి ల మొదటి రాజధాని - స్ధానేశ్వర్.
స్ధానేశ్వర్ - అంబాలా జిల్లా, హర్యానా. ప్రాచీన కురుక్షేత్ర ప్రాంతం.
ప్రభాకర వర్ధనుడు
ప్రభాకర వర్దనుని బిరుదులు - మహారాజాధిరాజా. ఈ బిరుదును బట్టి ఆయన మొదటి స్వతంత్ర్యరాజు అని అవగతం అవుతుంది.
పరమభట్టారక - ప్రభాకర వర్ధనుని బిరుదు.
హూణ
హరిణ కేసరి ప్రభాకర వర్ధనుని మరో బిరుదు. (హూణులనే జింకల మధ్య ప్రభాకర
వర్దనుడు ఒక సింహం అని దాని భావం.)భానుడు ప్రభాకర వర్ధనుడిని ఆ విధంగా
సంభోధించాడు. కారణం ఆయన హూణులని ఓడించడం.
భానుని హర్ష చరిత్రలో ప్రభాకర వర్ధనుని జీవిత ముఖ్య ఘట్టాలు ప్రస్తావించబడినవి.
ప్రభాకర వర్ధనుని భార్య యశోమతి.
ప్రభాకర వర్ధనుడు మాల్వ రాజైన యశోధర్ముని కుమార్తె యశోమతి ని వివాహమాడాడు.
ప్రభాకర వర్ధనుని కుమారులు - రాజ్య వర్ధనుడు.
హర్ష వర్దనుడు.
కుమార్తె - రాజ్యశ్రీ.
అల్లుడు - గృహవర్మ (మౌఖరి రాజు)
ప్రభాకర వర్ధనుని మరణానంతరం ఆయన భార్య సతీసహగమనం చేసిందని భానుని హర్షచరిత్ర తెలుపుతుంది.
-----------------------రాజ్యవర్ధనుడు--------
పెధ్ద కొడుకు రాజవ్వాలనే నియమం ప్రకారం ప్రభాకర వర్ధనుని అనంతరం రాజ్యవర్ధనుడు రాజయ్యాడు.
దేవ గుప్తుడు - గుప్త రాజు. ఈ సమయంలో మగద ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు.
గౌడ శశాంకుడు - గౌడ వంశ రాజు. బెంగాల్ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. ఇతనే భోధి వృక్షాన్ని వేర్లతో సహా పెకిలించి వేసాడు.
దేవగుప్తుడు,
గౌడ శశాంకుడు స్నేహితులు. ఇధ్దరూ మౌఖరి వంశ శత్రువులు. ఇద్దరూ కలిసి మౌఖరి
రాజ్యం పై దండెత్తి హర్షుని బావ అయిన గృహ వర్మను హతమార్చి , హర్షుని సోదరి
రాజ్యశ్రీని బంధిస్తారు.
రాజ్యవర్ధనుడు దేవగుప్తుడిని సంహరిస్తాడు కానీ గౌడ శశాంకుని చేతిలో హతుడౌతాడు.
--------------- హర్ష వర్ధనుడు --
బిరుదులు -
రాజపుత్ర
శీలాధిత్య
మగధాదిపతి
సకలోత్తరపదేశ్వర (ఐహొలు శాసనంలో రవికీర్తి హర్షుడిని ఈ విధంగా పేర్కొన్నాడు.)
పరమ మహేశ్వర (బన్సిఖేర, మదుబని శాసనాలలో)
హర్షుడిని చివరి గొప్ప హిందూ రాజుగా భావిస్తారు.
గౌడ వంశస్తులను పారద్రోలి హర్షుడు మౌఖరీ సామ్రాజ్యాన్ని కాపాడతాడు. తన సోదరి రాజ్యశ్రీ
వింధ్య పర్వతాలలో ఆత్మహత్య కు పాల్పడుతుండగా రక్షిస్తాడు. రాజ్యశ్రీ బౌధ్ధ మతాన్ని స్వీకరిస్తుంది.
మౌఖరీ
రాజ్య మంత్రి పరిషత్తు హర్షుడిని మౌఖరీ రాజ్య పరిపాలనా బాధ్యతలు
స్వీకరించవలసిందిగా అభ్యర్దించగా హర్షుడు మౌఖరీల రాజధాని కనౌజ్ ని తన
రాజధానిగా చేసుకుని మౌఖరీ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు.
గుప్తులనుండి మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు.
శశాంకుని మరణానంతరం బెంగాల్ ని కూడా జయించాడు.
కళింగ రాజ్యాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు.
రెండవ ధృవసేనుని చంపి మైత్రక రాజ్యాన్ని తన సామంత రాజ్యంగా చేసుకున్నాడని నౌసని తామ్రపత్ర శాసనం తెలుపుతుంది.
ఐహొలు
శాసనం ప్రకారం హర్షుడిని బాదామీ చాళుక్య రాజు రెండవ పులకేశి హర్షుడిని
నర్మదా నదీ తీరంలో ఒడించాడని తెలుపుతుంది. యుధ్దం ముగిసిన తరువాత నర్మదా
నది ని ఇరు రాజ్యాల సరిహద్దుగా నిర్ణయించుకున్నారు.
పాకిస్ధాన్ లోని హైదరాబాదు శాసనం ఇరు రాజ్యాల మధ్య యుధ్ధం అర్ధాంతరంగా ముగిసిందని, యుధ్దంలో ఎవరూ ఓడిపోలేదని తెలుపుతుంది.
ఐహొలు శాసనం - 643 A.D.
బాదామీ చాళుక్య రాజు రెండవ పులకేశి ఆస్ధాన కవి రవికీర్తి దీని రచయిత.
రవికీర్తి తాను నిర్మించిన మేగుటి జైన దేవాలయం గోడపైనే ఐహొలు శాసనాన్ని చెక్కించాడు.
మేగుటి జైన దేవాలయం కర్నాటకలో ఉంది.
రవి కీర్తి రెండవ పులకేశిని దక్షిణాపధ పృధ్వీ స్వామి, పరమేశ్వర అనే బిరుదులతో పేర్కొన్నాడు.
హర్షుని
మరణానంతరం రాజ్యాన్ని అరుణార్షుడు అనే అధికారి ఆక్రమించాడు. హర్షునికి
చైనాకు చెందిన టాంగ్ వంశ రాజు టి సుంగ్ తో, కామరూప రాజు భాస్కర వర్మతో
స్నేహ సంబంధాలు ఉండేవి. టి సుంగ్ తన సేనాని వాంగ్ యువాన్ త్సె ను పంపగా,
భాస్కర వర్మ తో కలిసి ఇద్దరూ అరునార్షుడిని ఓడించి, అరుణార్షుడిని చైనాకు
బందీగా తీసుకుని వెళ్తాడు.
పుష్యభూతి రాజ్య పాలన గుప్తుల పరిపాలనను అనుసరించి సాగింది.
వికేంద్రీకృత పరిపాలన. భూస్వామ్య వికేంద్రీకరణ.
అనుత్పన్న దాన సముద్గ్రాహక - అత్యవసర పరిస్ధితులలో నిధులను సమకూర్చే అధికారి.
హర్షుడు గొప్ప సంస్కృత పండితుడు. ఆయన ప్రియదర్శి, నాగనందం, రత్నావళి గ్రంధాలను రచించాడు.
(దావకుడు ఆ గ్రంధాలను రచిస్తే హర్షుడు ఆ కీర్తిని తీసుకున్నాడని ఇటీవల దొరికిన ఆధారం)
భాణ భట్టుడు - హర్షచరిత్ర, కాదంబరి, పార్వతీ పరిణయం.
సోధ్దల - ఉదయ సుందరి కధ.
మయూర - సూర్య శతకం.
హర్షుడు తన జీవితపు మొదటి రోజుల్లో శైవ మతస్తుడు. తదనంతరం దివాకరుని ప్రభావం వల్ల బౌధ్ద మతాన్ని అవలంభించాడు.
హర్షుని
కాలంలో నలందా విశ్వవిధ్యాలయానికి ప్రధాన పోషకుడు. వంద గ్రామాలు నలందా
విశ్వవిధ్యాలయం పోషణ నిమిత్తం దానం చేయబడినాయి. నలంద విశ్వవిధ్యాలయంలో 8500
మంది విధ్యార్ధులు, 1500 మంది అధ్యాపకులు ఇతర ఉధ్యోగులు ఉండేవారు.
విధ్యార్ధులు అధ్యాపకుల నిష్పత్తి 6:1 ఉందని హుయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు.
(ఆయన తనకు నచ్చిన వారి గురించి కాస్త ఎక్కువగా, నచ్చని వారి గురించి తక్కువ
చేసి రాసేవాడు. నిజానికి నలందా విశ్వ విధ్యాలయం 2000 మందికి మించి వసతి
కల్పించేంత పెద్దగా లేదు.)
హర్షుడు ధర్మాసుపత్రులను, పేదలకు ఆహారాన్ని అందిచడానికి ధర్మశాలలను నిర్మింపజేసాడు.
మహామోక్షపరిషత్
- తన పాలనా కాలంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహామోక్షపరిషత్ ని
ప్రయాగలో ఏర్పరచి మత పెధ్దల చర్చలు జరిపించి, తన యావదాస్ధిని దానం చేసి
కట్టుబట్టలతో రాజధానికి చేరేవాడు. ఇలాంటి పరిషత్తులు ఆరింటిని హర్షుడు
జరుపగా చివరిదానికి చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ హాజరయ్యాడు.
మహామోక్షపరిషత్ రెండు నుండి మూడు నెలల కాలం వరకూ జరిగేది.
హుయాన్ త్సాంగ్ - బిరుదు యాత్రికుల యువరాజు.
హుయాన్ త్సాంగ్ సి.యు.కి. , సిద్ది అనే పుస్తకాలను రచించాడు.
హుయాన్ త్సాంగ్ నలంద విశ్వవిధ్యాలయాన్ని సందర్శించినప్పుడు విశ్వవిధ్యాలయ కులపతి (చాన్సలర్) శీలభద్రుడు.
Pushyabhuthi dynasty పుష్యభూతి వంశం Harsha vardhana
No comments:
Post a Comment