Search

Monday, October 17, 2016

Mohammad of Ghazni

Mohammad of Ghazni మహమ్మద్ గజనీ 1000AD-1030AD
Full name of Ghazni is Yamīn-ud-Dawla Abul-Qāṣim Maḥmūd ibn Sebüktegīn.
Title – Ghaaji. (Protector of Islam and slayer of non believers)బిరుదు - *ఘాజీ. - ఇస్లాం రక్షకుడు ఖాఫిర్ లను సంహరించేవాడు.
* Butshikan - Breaker of Idols. బుట్ షికాన్ -విగ్రహాలను ధ్వంసం చేసేవాడు.
* Ghazni Mahammad was the 1st person to take the title Sultan. సుల్తాన్ అనే బిరుదును మొదటి సారిగా ధరించిన రాజు మహమ్మద్ గజనీ.

Ghazni గజనీ మొహమ్మద్ మొత్తం 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర జరిపి దండయాత్ర జరిపిన ప్రతిసారీ పెద్ద ఎత్తున బంగారం, ఇతర సంపదను భారతదేశం నుండి తరళించుకు వెళ్ళి గజనీలో భవన నిర్మాణం, కళలు, సాహిత్యం అభివృధ్దికి పాటుపడ్డాడు.
1000 - వైహింద్ పాలకుడు జయపాలుడిని గజనీ మహమ్మద్ ఓడించాడు. అవమానాన్ని భరించలేక జయపాలుడు తనను తానే అగ్నికి ఆహుతి చేసుకున్నాడు.
1008 లో ఆనందపాలుడు గజనీకి వ్యతిరేకంగా డిల్లీ, అజ్మీర్, కలింజర్, గ్వాలియర్,  కనౌజ్ పాలకులను ఏకం చేశాడు. గజనీకి వారిని ఎదిరించేంత సైన్యం లేదు కానీ ఆనందపాలుని ఏనుగు యుద్దంలో గాయపడటం వల్ల అది పిచ్చిపట్టినట్టు యుధ్ధ భూమిలో పరుగులు తీయడంతో ఆనందపాలుని సైన్యం ఆనందపాలుడు యుధ్ధభూమినుండి పారిపోతున్నాడని భావించి తామూ పారిపోవడంతో గజనీకి విజయం చేకూరింది.
 1025-26 లో సోమనాధ్ దేవాలయ దోపిడీ - రాజా భీమసోలంకి గుజరాత్ పాలకుడు. మూడురోజులు జరిగిన యుద్దంలో గజని విజేయుడుగా నిలిచి అపార ధన రాశులను కొల్లగొట్టాడు. దేవాలయ దోపిడీ సమయంలో సోమనాధ దేవాలయం పై ఆధారపడి జీవించే వందలాదిమంది దేవదాసీలు, వందలాది పూజారులు తిరుగుబాటు చేయక దేవుడే చూసుకుంటాడని గుడి మెట్లకు అడ్డంగా పడుకొన్నారు. అందువల్ల అనాయాసంగా గజనీ దేవాలయ దోపిడీని పూర్తి చేయగలిగాడు.

No comments:

Post a Comment

Blog Archive